ఆ స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారట


balakrishna  greensignal to krish for ntr movie changes మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ లో దర్శకులు క్రిష్ చాలా మార్పులు చేశారట ! అన్ని మార్పులు చేస్తే బాలయ్య ఒప్పుకుంటాడా ? అన్న అనుమానం ఉండేది కానీ క్రిష్ మీద ఉన్న నమ్మకం తో పాటు అతడు నెరేట్ చేసిన విధానం బాలయ్య కు బాగా నచ్చడంతో సంతోషంగా పచ్చ జెండా ఊపాడట . బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక రెగ్యులర్ షూటింగ్ మీద దృష్టి పెట్టాడు క్రిష్ . మొదట ఈ చిత్రానికి దర్శకుడు తేజ అన్న విషయం తెలిసిందే .

అయితే తేజ చెప్పిన మార్పులకు బాలయ్య ఒప్పుకోకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నుండి తేజ తప్పుకున్నాడు కట్ చేస్తే క్రిష్ వచ్చి చేరాడు . స్క్రిప్ట్ అంతా చూసాక క్రిష్ చాలా మార్పులు చేయాలనీ చెప్పాడట ! అంతేకాదు బాలయ్య అనుమతితో మార్పులు చేసి వినిపించడంతో బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . దాంతో జూలై 5 న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది .2019 జనవరి 9 న ఎన్టీఆర్ బయోపిక్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇంతకుముందు బాలయ్య – క్రిష్ ల కాంబినేషన్ లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే .