TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

uma maheeswari maheeswari's Blogs >> SAMSKAARAM

మొన్నా మధ్య మా దూరపు చుట్టాలింట్లొ ( నాకు ఆడపడచు వరస అవుతుంది తను ) ఏదో పూజ చేస్తున్నా పసుపు కుంకుమ తీసుకొవడానికి రా అని పిలిచింది. ఎప్పుడు చుసినా రాకుండా ఏదో కారణం చెప్తావ్ ఈ సారి ఆదివారం చేస్తున్నా అన్నయ్యను పిల్లలను కూడా తీసుకుని రా పొద్దున వచ్హేయండి సాయంత్రం వరకు అక్కడే ఉందురు అన్నది. నేను సరె అని తల ఆడించా. ఇక ఆదివారం రానే వచ్హింది మా పిల్లలు రాసుకోవాలి అన్న సాకు చెప్పేసారు ఇంక మా వారు ఆడవాల్ల పూజకు నేను రావడం ఏంటి అని వారు తప్పించుకున్నారు తను మా ఆడపడచులను కూడా పిలిచింది ఇంక చేసేదెమి లేక మేము ముగ్గరం కలసి వెళ్ళాం ఇంట్లో వంట కార్యక్రమాలు ముగించి వెళ్ళే సరికి అక్కడ సగం పూజ ముగిసింది
ఇక్కడ తన గురించి కొంచం చెప్తా . తనకు మా పిల్లల వయసు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు చాలా స్టితిపరులు,కొంచం డబ్బు ఉంది అన్న అతిసయమే తనకు. అది సహజమే అనుకోండి. ఇద్దరు స్కూల్ ఫస్ట్ వస్తారు అని ఎప్పుడు చెప్పేది. డబ్బు ఉంది, పిల్లలు బాగా చదువుతారు, మంచి భర్త ఇంక ఏం తక్కువ అనుకునే వాళ్ళం మా ఇంట్లో.


పూజ ముగిసిన తరువాత అందరు వెళ్ళి పోయారు, మేము రూం లొ కూర్చుని మాట్లాడుతున్నాం. మీ కుటుంబం అంటే మాకు చాలా గౌరవం అన్నయ్య కూడా వచ్హి ఉంటే బాగుండేది అన్నది. ఇంతలో తన స్నేహితురాలు కమల వచ్హింది. మీరు మాట్లాడుతూ ఉండండి ఇప్పుడే వస్తా అని వెళ్ళింది. వాళ్ళ అబ్బాయి ఇంటెర్ చదువుతున్నాడు వాడు మా దగ్గరకు వచ్హి ఆంటీ అమ్మ ఎక్కడ అడిగాడు.

ఎవరో వస్తే హాల్ కి వెళ్ళింది అన్నా, అతను హాల్లోకి తొంగిచూసి ఈ నస వచ్హింది ఇప్పుడే వదలదు అన్నాడు. ఎవరు వచ్హింది అడిగాను నేను. పక్కింటిది లె ఆంటి అమ్మకి ఫ్రెండ్ నాకు అతని వరస నచ్హలేదు అంత పెద్ద ఆవిడను పట్టుకుని అది ఇది అనడం నచ్హలేదు. ఎందుకు అలా అంటున్నావ్ అని అందామనుకున్నా.....కాని
సుమతి శతకంలో పద్యం జ్ఞాపకం వచ్హి మాట్లాడ లేదు నేను. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్హింది రూం కి, ఏమ్మా అది వెళ్ళిపోయింది అప్పుడే, లేదులేరా నేనె మా చుట్టాలు వచ్హారు అని పంపేసా. వాళ్ళ సంభాషన చూస్తుంటె నాకు చిర్రెత్తుకొచ్హింది. నాకు ఇంక అక్కడ ఉండడమే నచ్హ లేదు. ఇంక నేను వెళతా అనసూయా అన్నా. అదేంటి రాక రాక వచ్హావ్ కాసేపు ఉండు అన్నది. పని ఉంది ఇంకో సారి వస్తా అని చెప్పి వచ్హేసా.

వచ్హినప్పటి నుంచి మరుసటి రోజువరకు ఈ విషయాలే చెప్తున్నా మా వారికి. ఇప్పటికి ఇది పదో సారి చెప్తున్నావ్ అన్నారు .....(మా వారి లెఖ్ఖల పరిగ్నానికి మనసులోనే జోహార్ చెప్తూ)....మన పిల్లల్ని సరిగా పెంచవోయ్ చాలు వేరే వాల్ల గోల మనకెందుకు అని మావారి దైలాగ్...(నేను మన్సులో కూపస్త మండూకంలా ఆలోచిస్తున్నారు అనుకుని)...ఇంకోసారి చెప్తే ఆపుతావా నీ సోది అని ఎక్కడ కేకలు వేస్తారో అని ముందు జాగ్రత్తగా మానేసి నా గోడుని బ్లాగ్ లో పెట్టెసా.

డబ్బు, చదువు, హోదా ఉంటే చాలా సంస్కారం ఉండద్దా?? 

sreenivas medepalli
hello madam, samakaram gurinchi baga rasavu. bagundi.samskaram anedi okaru chepte vachedi kadu.okaru nerpithe vachedi kadu.vari amma nanna meeda adharapadi untundi.nenu meeku parichayam ledu.naa peru sreenivas medepalli .teacher ga pani chestunnanu.hyderabad ku daggaralo .maa avida swe .bangalore .meeku telugu parignanam baagundi. nenu aug 31 st akkada bangalore lo untanu( k.r.puram) maa mobile no 9490949353 ok untanu sumathi satakam bhaskara satakam, vemana satakam gurinchi ippudu cheppatledu pillalaku.ok untanu.meeku velupadithe bangalore lo kalustanu ok undana mari

Posted at: 10, Aug 2011 9:30 AM

Devender Chintala Devender
sanskaaram pai manchi katha. baagundi

Posted at: 20, Jan 2011 10:06 AM

uma maheeswari maheeswari
Mottaaniki naaku ardam ayindi enti ante ee srinivas gaaru roju chustunnaaru naa blog ni ani ardam ayindi. tq andi.

Posted at: 17, Nov 2009 11:21 AM

msk msk
డబ్బు, చదువు, హోదా ఉంటే చాలా సంస్కారం ఉండద్దా??

vundali madam, samskaram lekapote, cheppulu kutevadu/chetta ettevadu kooda pai nunchi kindaki oka sari chustaru.... so dabbu, chaduvu kante samskarame mukhyam - na opinion lo.............

Posted at: 17, Nov 2009 0:55 AM

uma maheeswari maheeswari
Kevv Raajaa .......Snig correct gaane cheppindi kadaa enduku delite cheyyadam.

Posted at: 15, Nov 2009 4:33 AM

uma maheeswari maheeswari
Thank You Snig

Posted at: 14, Nov 2009 4:38 AM

uma maheeswari maheeswari
Hello srinivas gaaru
anuvugaani chota adikulam anaraadu .....tanaku nenu edo cheppaboyi .....tanani kinchaparichantlu feel avutundi emo ani nenu cheppaledu.....so noppinchaka ...taanovvakka tappinchuku tiruguvaade danyudu sumathi padyam jnaapakam undaandi meeku.
inka naa vivaraalu antaaraa .......Mukku Moham teliyani vallaku ( i mean parichayam) evaru ayinaa vivaraalu istaaraa???..........ivvaledu ani blog raase eligibilityne ledu ani decide chesesaaru kadandi. parledu.
Enthati bangaaram ayinaa kaani Saana pettakundaa Meravadu
mee comments anni naaku sirodaaryaalu.
tondaralo maro kotta blog lo kalusukuntaam.
bye

Posted at: 13, Nov 2009 0:38 AM

Rama Krishna Rao A
blog chala bagundi Uma.Nuvvannadi aksharala nijam

Posted at: 4, Nov 2009 8:01 AM

leelarani annam
Mokkai vanganidi Maanai vangunaa .........Maryada annadi chinnappati nunchi raavaali.
Evaru elanti vallu ayinaa kaani manam ichhe maryada manam ivvaali...Matallone kadaa samskaaram telustundi.

Posted at: 3, Nov 2009 11:43 PM

uma maheeswari maheeswari
Snig cheppindi correct............mana mundu vere vallani annadu ante manam lenappudu manalni kudaa ante kadaa anna alochana vachhindi.
Kalpita aavida elantidi ayinaa kaani vayasu lo peddadi kadaa maltadetappudu pedda , chinna ane maryada vaddaa ? adi paraayi valla mundu matladadam sababenaa ..


Posted at: 3, Nov 2009 8:36 AM
  
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
Regional News
Anantapur
Eluru
Guntur
Hyderabad
Kadapa
Kakinada
Karimnagar
Kurnool
 
Nellore
Ongole
Nizamabad
Rajahmundry
Tirupati
Visakhapatnam
Vijayawada
Warangal
Photos
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Articles
All Articles
Poetry
Short Stories
Blogs
My Blogs
Popular
Active Blogs
Recently Created
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals
Networking
My Friends
New Members
Invite a Friend
 
Discussion
Poetry
Govt and Politics
Offbeat and Jokes
Videos
Top in Views
Top by Rank

(C) 2000-2018 TeluguPeople.com, All Rights Reserved.