Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 94743 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2232
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1335 on: October 15, 2017, 04:21:13 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

 15. శ్లో ॥   సపితా సచమే మాతాసబంధుస్సచ  దేవతా ।
               సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥   
   
                                           శ్రీ రామవధూత చరిత్ర (టి . శైలజ )
దత్తు :
హైదరాబాదులోని ఐ .డి .పి .ఎల్.  లో పని చేసే కార్మిక నాయకుడు కృష్ణారెడ్డి అతనికి ఒక కుమార్తె ,ఒక కుమారుడు . ఆ అబ్బాయికి రఘునందనుడని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు . 2 1/2  సంవత్సరాల ఆ బాబు ఒకరోజు ఆటలాడుకుంటూ కాలుజారి చిన్నగట్టుమీద నుంచి పడిపోయాడు . అది చిన్నగట్టే అయినా కూడా రక్తం కారడం ప్రారంభమైనది . అలా మొదలైన రక్తస్రావం ఏంచేసినా తగ్గలేదు . డాక్టరు సలహా మేరకు బాబు తండ్రి కోరగా అతని స్నేహితులందరూ వచ్చి రోజుకొకరు చొప్పున 12 మంది 12 రోజుల పాటు రక్తం ఇచ్చారు . అయినా పరిస్థితిలో మార్పు రాకపోగా ఆ అబ్బాయికి కామెర్ల వ్యాధి కూడా వచ్చి పరిస్థితి మరింత విషమించింది . రోజు రోజుకూ ఆ చిన్ని శరీరం కృశించిపోతోంది .కళ్ళముందే కన్నబిడ్డ పడే బాధ చూడలేని కన్నవారి బాధ వర్ణనాతీతం .

అటువంటి విపత్కర పరిస్థితులలో అఖండ సాయి నామ సప్తాహ సమితి గురించి తెలిసి సమితిని వేడుకోగా సమితి కూడా ఆ చిన్నవాడి స్థితికి కలవరపడి అనసూయామాత దగ్గరకు పంపించాలనీ ఆవిడైతే ఆ బాబుకి ప్రాణభిక్ష త్వరగా ప్రసాదిస్తుందని భావించి అనసూయామాత దగ్గరకు పంపేముందు తాతగారి అనుమతి తీసుకుని వెళ్లాలని భావించింది . అయితే తాతగారి గురించికానీ ,అవధూతల లక్షణాలు కానీ తెలియకపోవడమే కాక అసలు తాతను ఎలా వేడుకోవాలో కూడా తెలియని స్థితిలో ఉన్నవారిని తాత దగ్గరకు పంపిస్తే వారు తాతను ప్రార్ధించలేరని తెలిసి అప్పటికే తాత భక్తులైన సమితి సభ్యులకు విషయం వివరించి తాత ఆశీర్వచనం వారికి దక్కేలా చేయమనగా ఆ సభ్యులు నిండు మనస్సుతో తాత వద్దకు వెళ్లి  ఆ పిల్లవానికి ప్రాణబిక్షను ప్రసాదించమని ఎంతగా ప్రార్ధించినప్పటికీ తాత నుంచి సమాధానం లేదు . తాతమౌనం వారిని కదిలించి వేయగా కన్నీళ్లతో ఎలాగైనా ఆ బాబును కాపాడి ఆ తల్లితండ్రుల క్షోభ తప్పించమని మరీమరీ ప్రాధేయపడగా అప్పుడు తాత " ఆమె ( అనసూయామాత ) మాత్రం ఏం చేస్తుంది ? వీళ్ళు కష్టపడాలిగాని " అని సందేశమిచ్చారు . అంటే ఈ కష్టాలన్నీ కర్మలకు సంబంధించినవి కాబట్టి అవి తీరాలంటే గురుకృప పొందాలి . ఆ గురుకృప పొందాలంటే తల్లితండ్రులు కష్టపడాలి . ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నతల్లితండ్రులకు ఈ వివరాలేమి చెప్పకుండా తాత అభయమిచ్చారనీ ఇక వారికీ భయము అక్కరలేదనీ చెప్పారు . తరువాత సమితి ఇది ఏనాటి పాపకర్మనో ,ఎన్ని జన్మల కర్మఫలమో దీనిని ఏ విధంగా తొలగించవచ్చోనని తీవ్రంగా ఆలోచించి తాత ఇచ్చిన సందేశముతో వారితో సేవ చేయించుటకు ప్రారంభింపచేసారు . అందులో భాగంగా కనీసం నోటితోనైనా భగవంతుని స్మరిస్తారని ఆ బాలుని " దత్తు " అని పిలవమని చెప్పారు . అంతేకాక గురుకృపను పొందడానికి ,కర్మలను తప్పించడానికి మార్గమైన గురుచరిత్రను 108 పారాయణలు చేయడం ద్వారా ఈ కర్మ నుంచి తప్పించుకోవచ్చని చెప్పగా దైవభక్తురాలైన తల్లి ఈ విషమ పరిస్థితిని తప్పించమని దత్తాత్రేయుని వేడుకొంటూ తన మొదటి పారాయణనను గాణుగాపూరులో ప్రారంభించి తన ఇంటిలో నిత్యం పారాయణం చేయడం ప్రారంభించింది . ఇక తండ్రిని ప్రతి నెలా తాతగారి వద్దకు పంపి ప్రాణాభిక్షకై వేడుకొనగా  ఆ తండ్రి క్రమం తప్పకుండా ప్రతినెలా తాత దర్శనానికై కల్లూరు వెళ్లి తాతను సేవిస్తూ ఉండేవాడు . ఇలా నిత్యం తాతతో సాన్నిహిత్యం పెరగడం వలన అతనికి తాత చర్యలు లీలలు  అర్ధమవ్వడంతో తాతపై సహజమైన భక్తి ప్రేమలు ఏర్పడ్డాయి . ఆ రకంగా దైవాన్ని నమ్మని స్థితి నుండి ప్రత్యక్షంగా దైవాన్ని కొలిచి ఆనందించే స్థాయికి ఎదిగాడు .         
                                     
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2232
  • View Profile

 జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

16. శ్లో ॥  యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
              యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

                                   శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

తరువాత వారు తాతగారిని తమ స్వగ్రామానికి తీసుకుని వెళ్ళేటప్పుడు కారు బురదలో దిగబడిపోయింది . ఎంతగా ప్రయత్నించినప్పటికీ కారు కొంచెమైనా కదలడం లేదు . చూస్తే  అక్కడ మనుషులెవరూ సాయం చేయడానికి లేరు . వీళ్లను  వారి ఊరికి తాతతో పాటుగా తీసుకువెళ్తున్న మల్లేష్ కు కూడా ఏమీ చేయుటకు పాలుపోలేదు . అప్పుడు హఠాత్తుగా తాత 'పోతుందిలే ' అన్నారు . అనడంతోనే కారు కదిలి బురదలో నుండి బయటకు వచ్చి ముందుకు సాగిపోయింది . మహాత్ముల వాక్కులోని ఆ శక్తికి నిర్జీవమైన కారులో కూడ కదలిక వచ్చిందని అందరూ ఆశ్చర్యపోయారు . గ్రామం చేరిన తరువాత ఆ బాబు చేత తాతగారికి ఒక కొబ్బరికాయ ఇప్పించి తాత ఆ కారును స్వీకరిస్తే ఆ అబ్బాయి కర్మను తాత తొలగించినట్లు అని భావించినవారై ఆ బాబు చేత కాయను ఇప్పించగా ఎంతసేపటికీ తాత ఆ కాయను తీసుకోలేదు . అప్పుడు ఆ తల్లితండ్రులు ఎంతో దీనముగా తాతను ప్రార్ధించగా ఆఖరుకు తాత ఆ కాయను స్వీకరించి వారి ఆందోళననూ , ఆ అబ్బాయి కర్మను కూడా తొలగించి అతనికి ప్రాణభిక్ష నొసగిరి . ఆ రకంగా తాత తప్ప శరణు లేడని వేడుకొనగా అప్పుడు తాత ప్రసన్నుడై ఆ బాలునికి ప్రాణదానం చేసారు . అంతేకాక వారి గ్రామంలోని వారి స్వంతింట్లో ఉన్న ఇక్కట్లను కూడా తొలగించి వారికెంతో మేలు చేసారు . ఈ రకంగా డాక్టర్ల బారిన పడిన ఆ అబ్బాయిని ఎప్పుడైతే వారు దైవంపై ఆధారపడ్డారో ఆ క్షణం నుంచి ఇక ఆ బాబుకి ఏ మందూ వేయక కేవలం ఊదీ తీర్ధములతో భగవంతునిపై ఆధారపడి గట్టి నమ్మకంతో ఉండి తమ బాబు ప్రాణాలు కాపాడుకోగలిగారు . ఇప్పుడు ఆ బాబు సంపూర్ణ ఆరోగ్యంతో చదువులో ముందంజ వేస్తూ ఆనందంగా ఉన్నాడు .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2232
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1337 on: October 17, 2017, 06:39:18 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

    17. శ్లో || యస్మిన్ స్థితమిదం సర్వంభాతియద్భానరూపతః  |
                  యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ||


                                      శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

 మాంగల్యభాగ్యం :

లలితాంబ అను భక్తురాలికి తాతగారు వినాయకుడిగా దర్శన మిచ్చారు . ఆ తరువాత వీళ్ళ అమ్మాయికి జబ్బుచేస్తే తాతగారు కలలో ఆ అమ్మాయికి నూనె రాసేసరికి జబ్బు తగ్గిపోయింది . ఇంకొకసారి కలలో కనిపించి 'మీ ఆయన శవం అయ్యేదుంది ' అని చెప్పారు . ఆ తరువాత ఈమె భర్తకు వెనుకనుంచి బస్సు కొట్టి పొట్ట వరకూ ఎక్కినప్పుడు అతను ఏ విధముగా తప్పించుకున్నాడో ,రక్షింపబడ్డాడో ఎవ్వరికీ అర్ధము కానీ విధముగా అతను బతికి బయటపడ్డాడు . అప్పటివరకు తాత గొప్పతనము అర్ధము కాక అనేక  లౌకిక పరమైన కోరికలు కోరుతూ ఉండేవాళ్ళమనీ అలాంటి అల్ప కోరికలు కోరుకున్నందుకు ఆ తరువాత పశ్చాత్తాపపడి తాతకు నిజమైన భక్తులైనామనీ వారు మనస్ఫూర్తిగా తెలియజేసిరి .

అలివేలుమంగపతి నీకిదె వందనం!
జై సాయిమాస్టర్!   జై దివ్యజనని!! 

 
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2232
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1338 on: October 18, 2017, 06:03:45 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :


   శ్లో || 18 .  ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
                   జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

 

                                                  శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

సంకేతము :

ఈమని రామకృష్ణప్రసాదుగారు 1991 నవంబరులో ఒకసారి తాతవద్దకు వెళ్ళినప్పుడు  ' హీ విల్ బి ఇన్ హాస్పిటల్ ' అని స్పష్టముగా పలికారు . కానీ ఈయనకు తాతగారు ఎవరిని ఉద్దేశించి ఆ మాట మాట్లాడారో అర్ధముకాలేదు . అయితే ఇది జరిగిన కొన్ని రోజులకే వేరే ఊరిలో చదువుకుంటున్న వారి అబ్బాయి అనుకోకుండా జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు కాలేజీ నుండి కబురు వచ్చేసరికి పరిగెత్తుకుంటూ తాతవద్దకు వెళ్లగా తాతగారు 'ఏం కాలేదు పో ' అని అభయమిచ్చారు . కొడుకు వెళ్లేసరికి డాక్టర్లు తాము చేయగలిగినదంతా చేసామనీ ,ప్రాణం నిలబడడము చాలా కష్టమనీ  ,తామేమీ చెప్పలేమనీ తెలిపిరి . అది వినగానే తాత ఇచ్చిన ఆశీర్వాదము ,ఆదిలో మెదలాగా తాతపైనే భారము వేసి ప్రాణములు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు . రెండురోజులు తరువాత ఆ అబ్బాయికి ప్రాణగండం తప్పినట్లు డాక్టర్లు తెలిపిరి . ఈ విధముగా హాస్పిటల్ లో ఉంటాడని ముందుగానే హెచ్చరించుటయే కాక తాత దయతో ఆ అబ్బాయి ప్రాణములు కూడా నిలబడినవని తల్లితండ్రులు ఎంతగానో సంతోషించిరి . తాత వలన ప్రాణములు దక్కిన ఆ అబ్బాయి సాయిప్రదీప్ ,చదువులో ముందంజ వేసి ఇప్పుడు ఎమ్ . బి .ఏ  చదువుకుంటున్నాడు .
 

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2232
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1339 on: October 19, 2017, 06:42:13 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగపతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో || 19. యస్యజ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
           సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥

                              శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )
నో పర్మిషన్ :

ఒకసారి సాయిబాబాగారు భార్యతో కలిసి స్కూటరుపై కల్లూరు చేరి తాతను దర్శించి చీకటి పడకమునుపే వెనుదిరిగి వెళ్లాలనే ఉద్దేశ్యముతో తాతగారిని అనుమతి కోరగా తాత అనుమతినివ్వలేదు . మరికొంతసేపటి తరువాత మళ్ళీ తాతను అడుగగా తాత ' నో పర్మిషన్ ' ( అనుమతిలేదు ) అని అన్నారు . రాత్రి అవుతున్నకొద్దీ వీరికి 50 కి . మీ . దూరంలో ఉన్న గద్వాల ఎలా చేరుకోవాలన్న ఆతృత ,ఆందోళన అధికముకాగా నెమ్మదిగా తాతకు నమస్కరించి బయలుదేరి పోయిరి . స్కూటరు వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి మద్దిలేటి పరుగుపరుగున వగరుస్తూ వచ్చి వీళ్ళు బయలుదేరిన వెంటనే తాత  ' ఏందిరా ఏమనిపిస్తోంది ' అంటూ అక్కడే ఉన్న మద్దిలేటిని వంగోబెట్టి గుద్దుతూ 'ఏం కాళ్ళూ చేతులూ విరగొట్టుకోవాలనుందా ,ఎముకలు విరుగుతాయి ,జాగ్రత్త ' అని అనసాగారు . అప్పుడు మద్దిలేటి తాత అనుమతి లేకుండా బయలుదేరిన సాయిబాబా గారికి దారిలో ఎదో ప్రమాదము  సంభవించబోతున్నట్లు  తాతగారు సూచించారను  సంగతి అర్ధమై వీరి వద్దకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ కల్లూరు వదలిపోవద్దని విడమరచి చెప్పేసరికి తమకు అన్ని విధములుగా సూచనలిచ్చి ,తమ క్షేమం కోరి తాత పలికిన పలుకులకు వారి హృదయములు ద్రవించి తాత తనవద్ద నిద్రచేయుటకు ఇచ్చిన అవకాశముగా భావించి అక్కడే తాత వద్ద నిద్ర చేసి మరునాడు పొద్దున్న తాతను అడుగగా తాత నవ్వుతూ అనుమతినిచ్చిరి . క్షేమముగా గద్వాల చేరిన తరువాత వారికొక సంగతి తెలిసింది . ముందురోజు రాత్రి గద్వాల నుండి కర్నూలు బయలుదేరిన ఇద్దరు వ్యక్తులను దారిలో దుండగులు రోడ్డుమీద రాళ్లు అడ్డుపెట్టి వారిని కర్రలతో ,ఇనుపఊచలతో గాయపరచి దోచుకోగా అందులో ఒకరు దెబ్బలు తిన్నప్పటికీ ఎలాగోలా తప్పించుకుని గద్వాల చేరి సంగతి వివరించి హాస్పిటల్ లో చేరగా అందరూ కలిసి ప్రమాదస్ధలికి చేరుకుని రెండవ వ్యక్తిని కూడా ఆస్పత్రిలో చేర్చిరను సంగతి విని తాతగారు తమకు రాత్రి వెళ్ళుటకు అనుమతినివ్వకపోవడములోని ఆంతర్యము అర్ధమై తాత ప్రేమలో మైమరచిపోయిరి .

 అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2232
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1340 on: October 20, 2017, 06:21:39 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 20.  అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
               జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

                                శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

బ్రేకులు లేవు :

ఒకసారి తాతగారిని కర్నూలు   నుండి దత్తగడ  కు తీసుకుని వచ్చుటకు   కర్నూలు చేరి తాత అనుమతి పొంది ఆ తరువాత కొత్తగా కొన్న మెటడోర్   వ్యానును అద్దెకు మాట్లాడుకుని తాతగారిని తీసుకుని దత్తగడ  ప్రయాణమైరి . అయితే దారి పొడవునా తాతగారు " దీనికి బ్రేకులు లేవురా " అని తిట్టసాగారు . వ్యాను డ్రైవరుకు ఇదేమీ అర్ధము గాక తెల్లబోయాడు . ఈ విధముగా కొంత దూరము వెళ్లేసరికి నిజముగానే బ్రేకులు ఫెయిల్ అయ్యాయి . కానీ ఎవ్వరికీ ఏ ఆపదా వాటిల్లలేదు . అది చూసిన డ్రైవరు ఆశ్చర్యానికి అంతేలేదు . క్షేమముగా దత్తగడ చేరుకున్న తరువాత తాత ఆ బండిని తిప్పి పంపించేయమని గొడవ ప్రారంభించారు . తాత వాక్కునే ఆజ్ఞగా పాటించే ప్రభాకర్ గారు రాను పోను మాట్లాడుకున్న బండికి అద్దె చెల్లించి తిప్పి  పంపేసారు . తిరుగు ప్రయాణమైన ఆ బండికి ప్రమాదము జరగడమూ ఆ డ్రైవరు ఎదో విధముగా బయటపడి ఆపద తప్పించుకుని ముందుగానే బండి స్థితిని తెలియజెప్పిన తాత సామాన్యుడు కాదని గ్రహించిన వాడై కొన్ని రోజుల తరువాత తాత  దర్శనం చేసుకోగా తాత 'అమ్ముకో పోరా ' అన్నారు . అయితే తాత శక్తిని తెలుసుకున్నప్పటికీ కొత్తబండిని అమ్మితే బాగా  నష్టం  వస్తుందన్న భయముతో అమ్మకుండా ఆ విధముగానే తిరగడం ప్రారంభించేసరికి మళ్ళీ ఆ బండి ప్రమాదమునకు గురైంది . కానీ ఇతను బతికి బయటపడ్డాడు . దానితో అతను  లాభనష్టాలకోసం చూసుకుంటే ప్రాణములకే ప్రమాదమని తెలుసుకున్నవాడై ఆ బండిని అమ్మేసి తరువాత వేరొక బండిని కొని సుఖముగా ఉన్నాడు . ఆ రకముగా తాత తన సర్వజ్ఞత్వమును తెలుపుటయే కాక , తన శక్తిని తెలియని వారైనప్పటికీ వారి ప్రాణములు రక్షించి కాపాడిరి .
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2232
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1341 on: October 21, 2017, 05:34:52 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత 

శ్లో ॥ 21.  శోషణం భవ సింధోశ్చ  దీపనం క్షర సంపదాం ।
             గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

                          శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

దత్తావతారం :

అఖండ సాయి నామ సప్తాహ సమితివారు కల్లూరులో సాయినామ ఏకాహం చేయడానికి 1-1- 1989 తేదీని నిర్ణయించారు . ఈ కార్యక్రమంలో భాగం పంచుకోడానికి భక్తులందరూ అప్పటివరకు ఎంతో భక్తిప్రేమలతో ఒక బస్సును ఏర్పాటు చేసుకుని బయలుదేరారు . భక్తులంతా అప్పటివరకు తాతను గురించి వినడమే కానీ ప్రత్యక్షంగా దర్శించుకోవడం అదే ప్రథమం కాబట్టి అందరూ ఎంతో ఉత్సాహంతో కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరారు . కార్యక్రమం 1-1- 89 కాబట్టి అందరూ 31-12-88 రాత్రి నూతన సంవత్సర ప్రారంభంలో నూతనోత్సాహంతో బయలుదేరారు . తెలతెలవారుతుండగా బస్సు కర్నూలులోని హంద్రీ నదిని సమీపించింది . కల్లూరు చిన్నగ్రామం కావడం చేత ఇంతమంది స్నానాదులకు అక్కడ ఏర్పాట్లకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశ్యంతో హంద్రీనది ఒడ్డునే కాలకృత్యాలు తీర్చుకుని కల్లూరు చేరాలని సమితి సభ్యులు నిర్ణయించారు . అప్పుడు ఆ బస్సులో ప్రయాణిస్తున్న హెచ్ .ఎమ్ . టి . ఉద్యోగి గోపీనాథ్ ,అతని భార్య 4 సం . ల కుమార్తె ,ఒక సం . బాబు స్నానాల కోసం బస్సు దిగినవారు అలా అలా ముందుకు వెళ్ళిపోయి దారి తప్పారు . పూర్తిగా నిర్జన ప్రదేశానికి చేరుకున్న వారు ఎటు వైపుకు వెళితే సరియైన దారో తెలియక తికమక పడ్డారు . అలాంటి దిక్కుతోచని స్థితిలో సహజంగా సాయిబాబా భక్తులైన వీరు మనసులో బాబాను ప్రార్ధిస్తూ తమకు తోచిన  దిక్కుగా వెళ్ళసాగారు . అలా భగవంతునిపై భారం వేసి వెళ్తున్నారే కానీ ఆ దారి సరియైనదో కాదో కూడా వారికి తెలియదు . ఎంతదూరం నడిచినా కానీ నదీతీరం కనిపించక వారు అందోళనకు  గురై   తత్తరపాటుతో నడుస్తూ అనుకోకుండా ఒక ఊబిలో కాలు వేసారు . ఇంకేముంది ? పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లైంది వారి స్థితి .

ఎలుగెత్తి అరచినా కూడా మంసేహి జాడైనా లేని ఆ ప్రాంతంలో  వాళ్ళు ప్రాణ భయంతో ,ఏ దేముని దర్శనానికై తాము వస్తున్నారో ఆ దైవమైన రామిరెడ్డి తాత గారిని ఎలుగెత్తి ప్రార్ధించసాగారు . క్రమంగా ఆ ఊబిలోకి కూరుకుపోతున్నవారు ఆ కొత్త ప్రాంతంలో దిక్కులేని చావుకు గురవుతున్నామనే భాయాందోళనలతో " తాతా ! సాయీ ! ఏ పాపం చేసామని మాకీ దుస్థితి ! నీ దర్శనానికి వస్తున్న మమ్మల్ని నువ్వు దయతో కాపాడలేవా ? అని వెక్కి వెక్కి ఏడుస్తూ వేడుకుంటున్న సమయంలో ఎక్కడనుంచి వచ్చారో ముగ్గురు మనుష్యులు  సైకిళ్ళమీద ఆ దారిలో వెళుతూ వారి దీనాలాపనలు విని అటుగా వచ్చి తమ వద్ద నున్న తాళ్లతో వారినందరినీ ఆ ఊబి నుండి బయటకు లాగి రక్షించారు . ఒక్క మనిషి కూడా కనిపించని ఆ ప్రాంతంలో ముగ్గురు మనుష్యులు రావడమే కాకా వాళ్ళ దగ్గర ఆ సమయానికి తాళ్లు కూడా ఉండడం అంటే ఇదంతా ఎవరు చేసిన ఏర్పాటు ? ప్రాణభయంతో వారు చేసిన ఆర్తనాదం విని కరుణించిన కల్లూరు వాసి ,త్రిమూర్త్యావతారమైన మన రామిరెడ్డి తాత ఆ రకంగా తమ దర్శనానికై వచ్చేవారికి తానూ దత్తుడనని తెలియచేయుటకు ముగ్గురి రూపములో వెళ్లి ప్రాణబిక్షను పెట్టిన కారుణ్యమూర్తి . ఆ రకంగా ప్రథమ దర్శనంతోనే తాత మహిమను తెలుసుకున్న ఆ కుటుంబం సదా తాతను భక్తి ప్రేమలతో పూజిస్తూ ఆనందంతో ఉన్నది .

                                                                ఓం త్రిమూర్తి స్వరూపాయనమః

                                           త్వమేవ సర్వం మమ దేవ  దేవ
                                    పదహారవ అధ్యాయము సంపూర్ణము
 

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2232
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1342 on: October 22, 2017, 05:59:33 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో || 22. మన్నాధః  శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు: ।
               మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః

                 శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ ) 
                                                                       అధ్యాయము -17
                                            శ్రీగణేశాయ నమః  శ్రీ సరస్వత్యై నమః  శ్రీ రామావధూతాయనమః
                                                            అనక్కసోదరం అపురూపం అనాథ రక్షకం
                                                           తారయతి సంసారాత్ తాత ఇత్యక్షర ద్వయం
తాతగారు వివిధ సందర్భములలో  ప్రాణదానము చేసిన మరిన్ని సంఘటనలను ఇప్పుడు తెలుసుకుందాం .

పతిభిక్ష :
పుట్టుకతోనే గుండెలో లోపముతో పుట్టిన సత్యనారాయణ రెడ్డిగారికి ఆ సంగతి తెలియదు . పెద్దయిన తరువాత ఆ వ్యాధి ముదిరి ప్రాణాంతకమై డాక్టర్లు ఆపరేషను చేయాలనీ అయినా ఫలితము చెప్పలేమనీ చెప్పేసరికి ప్రాణభయముతో భార్యాభర్తలిద్దరూ తాతను చేరగా , రెడ్డిగారి భార్య తాత రెండు పాదములు పట్టుకుని శరణు వేడుకుంటూ  మాంగల్య భిక్ష ప్రసాదింపుమని పరి పరి విధముల ప్రార్ధించగా తాతగారు మొదట అంగీకరించక అతని జన్మవృత్తాంతము తెలుపుతూ దానివలన తలెత్తిన సమస్య అని వివరించగా వారికి డాక్టర్లు చెప్పినదీ  ,తాతగారు చెప్పినదీ ఒకటే కావడంతో మరింత కరుణతో తాతను ఈ సమస్య నుండి గట్టెకించమని కోరగా అప్పుడు తాతగారు అతని కర్మను తొలగించిరి . బ్రతకడు అనుకున్న ఆయన తాత దయతోనూ వైద్య సహాయముతోనూ ప్రాణాలు దక్కించుకొని అప్పటినుండి కృతజ్ఞతా పూర్వకముగా తాత సేవ చేయుటకు నడుం బిగించిరి .

                                               ఓం ఆశ్రిత రక్షకాయ నమః
 
 
 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2232
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1343 on: October 23, 2017, 05:30:58 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 23.       ఏక ఏవ పరో బన్ధుర్విషమే సముపస్ధితే ।
              గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః॥   

                                              శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

అప్పటినుండి డాక్టరుగారి మనసులో విపరీతమైన మార్పు కలిగి వారి చెడు సావాసములన్నింటికీ స్వస్తిపలికి ఎవరెన్ని విధములుగా మళ్ళీ మనసును పాతదారిలోకి మళ్లించాలని ప్రయత్నించినా చలించక ప్రతివారం తాతను దర్శించుకుంటూ , దర్శించిన ప్రతిసారీ తాత చూపించు ప్రేమ ,లీలల ద్వారా సరియైన శిక్షణ పొంది మానసికంగా పరివర్తన చెంది తాతకు నిజభక్తునిగా మారిరి . అదే విధముగా తాతగారు కూడా ఎప్పటికప్పుడు ఆయనను తన చర్యల ద్వారా ప్రోత్సహిస్తూ ఉత్సాహపరచుచుండిరి . ఒక సందర్భములో తాతగారు ఈయనకు ఒక రూపాయి నాణెమును ఇచ్చిరి . వీరు దానినెంతో భద్రముగా పూజాయందుంచుకుని పూజించుచుండిరి . అయితే అనుకోని విధముగా ఒకసారి ఆ నాణెము పోయి తిరిగి అదే నాణెము మళ్ళీ వీరింటికి చేరుట వీరిని ఆశ్చర్యపరచినది . అప్పటినుండి దానిని భద్రముగా దాచుకొనిరి .

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2232
  • View Profile
జై సాయి మాస్టర్ !                     
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥ 24.    గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
               గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥   

                                                 శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )  .

ఆ తరువాత సత్యనారాయణ రెడ్డిగారు తాత సంస్థానమునకు కృతజ్ఞతా పూర్వకంగా అపూర్వసేవ లందించిరి . గురుస్థాన్ వద్ద గేటును ,మెట్లను నిర్మించుట వలన భక్తులకు అనుకూలముగా ఉండునట్లు చేసిరి . తరువాత విశేషముగా కృషి చేసి తాతగారి సమాధి మందిరమునకు ధనారెడ్డిగారు మరియు అనేకమంది భక్తుల సహాయ సహకారములతో తాతగారి విగ్రహమును చెక్కించి సమాధి మందిరమునందు వీరి చేతుల మీదుగా ప్రతిష్ఠించిరి . ఎంతసేవ చేసుకుంటున్నప్పటికీ తృప్తి ,శాంతి పొందని వీరు అటు పిమ్మట తన ఆలోచనలను విస్తృత పరచి కర్నూలు పట్టణమందు జరుగు సాయి సత్సంగ్ ల యందు తప్పనిసరిగా తాతగారి పటము నుంచుటయే కాక ,ప్రతినిత్యం తాతగారి లీలలను భక్తులకు తెలియపరచుట ద్వారా ఎందరో తాతను దర్శించి తాత ఆశీర్వాదము వారికి సంపూర్ణముగా లభించుట యందు కీలక పాత్ర పోషించిరి . కల్లూరు నందు తాతగారి విగ్రహ ప్రతిష్ఠను గావించిన స్పూర్తితో వీరు గ్రామ గ్రామమునందు తాతగారి మందిరములు నిర్మించుటకు పట్టణములందు తాతగారి విగ్రహ ప్రతిష్ఠాపనలు తన చేతుల మీదుగా జరిపించుటయే కాకా తన స్వగ్రామమునందు కూడా తాతగారి మందిరమును నిర్మిస్తున్నారు .
 
 అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

 
« Last Edit: October 24, 2017, 06:24:09 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2232
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1345 on: October 25, 2017, 05:45:23 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధో యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
            జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥

                          శ్రీ  రామావధూత   జీవిత చరిత్ర ( టి . శైలజ )

వెన్నునొప్పి :

ఒకానొక కుటుంబములో భార్య ,భర్త ,ఇద్దరు పిల్లలు కలరు . తండ్రి సంపాదనయే ఆ కుటుంబమునకు ఆధారము . పిల్లలు చిన్నవాళ్లు కావడం వలన ఆ తండ్రి కుటుంబ పోషణకై పార్టు టైం ఉద్యోగంలో టైపిస్టుగా చేరాడు . అటు ఆఫీసు ,,ఇటు ఈ ఉద్యోగమూ కొంతకాలమునకు అతనైకి మోయలేని భారము కాగా తీవ్రమైన వెన్నునొప్పికి గురైనాడు . రానురాను నెప్పి అధికమై వెన్నుముకను  పూర్తిగా లేపి తిన్నగా నిలబడలేని స్థితికి చేరుకున్నాడు . అతనికేమైనా జరగరానిది జరిగితే అన్న ఊహే ఆ కుటుంబము భరించే స్థితిలో లేదు . అతను దైవభక్తి కలవాడైనప్పటికీ అవధూత సాంప్రదాయముపై అవగాహన ఏ మాత్రమూ లేనివాడు . బంధుమిత్రుల ద్వారా తాతగారి మహిమను ,లీలలను వింటాము జరిగినది కానీ అతనికి తాతశక్తిపై గురి కుదరలేదు  కాబట్టి అన్ని రకాల మందులను వాడుతూ ఎక్కడో అక్కడ తన జబ్బుకు సరిపడా మందు దొరకకపోదు అన్న ప్రయత్నములో ఉన్నాడు తప్ప తాతని దర్శించితే తన జబ్బు నయం చేసుకోవచ్చునన్న ఆలోచనే అతనికి రాలేదు .

ఇటువంటి పరిస్థితులలో అనుకోకుండా అతని సోదరునికి సహాయముగా తప్పని పరిస్థితులలో కల్లూరు వెళ్ళవలసి వచ్చింది . అన్నదమ్ములిద్దరూ వెళుతుండగా శ్రీరామనవమినాడు కల్లూరు గురుస్థానమునకు ఊరేగింపుగా తరలివస్తున్న తాత భక్తజన సందోహము మధ్య దర్శనమిచ్చారు . తాతగారిని గాంచిన ఆనందములో సోదరుడు ఆ నడిరోడ్డుమీదనే తాతకు సాష్టాంగ నమస్కారములు గావింపగా ఈ పెద్దమనిషి మాత్రము తనకేమీ పట్టనట్లు నిలబడిపోయాడు . ఊరేగింపు ఆగడంతో భక్తులందరూ తమకు తోచిన విధముగా వారు తాతను సేవిస్తూ పూజిస్తూ ఉన్నారు . అయితే తనను చుట్టుముట్టిన భక్తబృందముపై నుండి తాత దృష్టి  దూరముగా నిలబడిన ఇతనిపై పడుట  జరిగినది . దృష్టి  మాత్రముచే కర్మలను ధ్వంసము చేయగలిగిన తాతగారి దృష్టి సోకుటచేతనే అతని వెన్నులో కదలిక కలగడమూ ,క్రమముగా మామూలు స్థితికి రావడమూ జరిగినది . చూసారుగా తాత అపార కృపావృష్టి . అటువంటి కృప అనే వర్షములో అందరూ తడిసి ముద్ద కావలసినదే . ఇంత జరిగినప్పటికీ అతనికి తాతగారిపై ప్రత్యేక భక్తి ప్రేమలు కలుగలేదు . కానీ కాలక్రమములో అతని పిల్లలు తాతకీర్తిని గానం చేయడం ద్వారా తమ కుటుంబమునకు తాతగారు చేసిన మేలుకు తమకు తెలియకుండానే తమ కృతజ్ఞతలను ఆ రూపంలో తెలుపుకున్నారు . ఆ రకంగా అవధూతలకు మన పూజ ,ప్రార్థనలతో నిమిత్తము లేకుండా వారు ఎప్పుడు ఎవరిని కరుణించదలచారో  దానికి తగిన రంగం వారే సిద్ధపరచుకుని ఆ కార్యం నెరవేరేలా చేస్తారని అర్ధమవుతోంది .
అలివేలుమంగ పతి నీకిదె వందనం !

జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2232
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1346 on: October 26, 2017, 06:20:17 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
 
శ్రీ గురు గీత :
శ్లో ॥ 26.     అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ధ్విభాహుశ్చహరి: స్మృతః ।
             యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు: కధితః ప్రియే ॥

                                         శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ప్రాణదానం :

1992 సం . డిసెంబరు మాసములో  సాయినామ సప్తహ సమితిలో ఎవరినైతే మల్లేష్ తల్లిగా భావించాడో ఆమె ఊహించని విధముగా అనారోగ్యము పాలైంది . ఏమి జబ్బో కూడా తెలియని స్థితిలో పరిస్థితి పూర్తిగా విషమించి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది . ఇక భగవంతుని రక్షణ కరుణలు మాత్రమే ఈమె ప్రాణములు కాపాడగలవు తప్ప ఏ మందులు ఏమి చేయలేవని అందరూ ఏకాభిప్రాయమునకు వచ్చిరి . ఒక్క మల్లేష్ కాక ఆమెతో ఇదే అనుబంధమున్న షిరిడీ సాయి సేవా సంస్థ రాజు తీవ్రముగా ఆలోచించి పరిస్థితిని ఏ విధముగా అదుపు చేయాలో అని యోచించి తాత తప్ప ఈ స్థితి నుంచి బయటపడవేయువారు ఇక ఎవ్వరూ లేరని తెలుసుకున్నవారై ఎంతో ఆతృత ,ఆందోళనలతో తాతను చేరి సంగతినంతా విడమరచి చెప్పగా తాతగారు ఎంతకూ అంగీకరించరైరి . అయితే ఇటువంటి విషయములలో ముందునుండీ అవగాహన కలిగిన మల్లేష్ పరిపరి విధముల తాతను ప్రార్ధించగా ఎప్పటికో అంగీకరించిన తాత రాజు కారులో బయలుదేరిరి . తీరా బయలుదేరిన తరువాత కారును హైదరాబాదువైపుకు కాక నంద్యాల మార్గము పట్టించిరి .  క్షణ మొక యుగములా ఉండగా తాతను ప్రసన్నులను చేసుకుని మరల వేడుకోగా అప్పుడు ఇక తాతగారు ఎటువంటి అభ్యంతరమూ తెలుపక తిన్నగా హైదరాబాదు చేరిరి .

 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2232
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
    శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనమ్ ।
              తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥

                                                  శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

మనము ఇంతకుముందు చూసిన  అనేక సందర్భములలో ఒకరి విషయములో కుటుంబ సభ్యులు తప్ప వేరొకరు కలిగించుకుంటే ఈ కర్మ సిద్ధాంతములో దానిని అంగీకరించని తాత ,ఈ విషయములో మాత్రము  వీరి కోరికను మన్నించారంటే వారు ఆమె పట్ల స్వచ్ఛమైన మనసు ,కలిగి ఉండి త్రికరణ శుద్ధిగా ఆమెను తల్లిగా భావించడమూ ,నేటి ఆమె స్థితికి ఎంతగానో ఆందోళన చెందడమే కారణము . మనచుట్టూ పరిచయస్థులు  ,మనను  ప్రేమించేవారు అనేకమంది ఉండవచ్చు కాక ,కానీ  క్లిష్ట పరిస్థితులలో మనకు అండగా నిలిచి నేనున్నానని బాధ్యత వహించేవారే నిజమైన అభిమానులు . ఆమెపట్ల ఈ భావన కలిగిన వీరికి ప్రేమను వెల్లడి చేయవలసి వచ్చినపుడు వారు స్వచ్ఛముగా ఈ బాధ్యతను వహించిరి . ఆ విధముగా ఎంతో బాధ్యయుతముగా తాతగారిని హైదరాబాదు ఆమె ఇంటికి తీసుకువచ్చి తాత తప్ప శరణు లేడని ప్రార్ధించగా తాతగారు ఆమెను సమీపించి కేవలము  కరుణాదృక్కులు ఆమెపై కురిపించి వారి ఆతిధ్యమును స్వీకరించి మరలివెళ్లిరి . తాతగారిని తిరిగి కర్నూలుకు తీసుకువెళ్ళినపుడు రాజు ,మల్లేష్ లు ఎంతో ఆతృతగా తాతగారిని ఆమెకిక ఏమీ ఫరవాలేదా అని అడుగగా తాత చిరునవ్వే వారికి సమధానమైనది . తాత చర్యలలోని అంతరార్ధము తెలిసిన వారైనప్పటికీ ,ఆందోళనతో నున్న వీరికి గండము నిజముగనే గడించినదా లేదా అన్న భయము మాత్రము  వీడలేదు . ఇది తాతగారి శక్తిపట్ల ఉన్న అనుమానము కాక ,ఈ విషయములో తాతగారు ఎంతవరకు బాధ్యత స్వీకరించారో నాన్న భయము వారిని వెంటాడసాగినది . అయితే హైదరాబాదు తిరిగి వచ్చిన వీరికి ఆమె పరిస్థితిలో కొట్టొచ్చిన మార్పు కనిపించి కనిపించి  జీవకళ ప్రారంభమైంది  అని అర్ధమయ్యింది . అయితే ఇంకా ఆతృత తగ్గని వీరు ఈ విషయమును స్వామీజీకి తెలిపి వారి ఆశీస్సులు కూడా పొందుటకు రాజు కారులోనే షిరిడీ వీరు స్వామీజీకి సంగతినంతా వివరించగా స్వామీజీ ' తాత వచ్చి వెళ్లారు కదా ఇక భయములేదు ' అని ధైర్యమునిచ్చిరి . అయినప్పటికీ మల్లేష్ కు ఇంకా ఆతృత  తగ్గక వీరికి ధైర్యం చెప్పడానికే స్వామీజీ అలా తెలిపారా  నిజముగా గండము గడిచిందా అను అనుకుంటూ ప్రతినిత్యం చావడిలో భజన చేసే స్వామీజీ ఆనాటి భజనలో ఫలానా పాట  పాడితేనే  ఈ గండం నిజముగా గడిచినట్లు లేనిచో కానట్లు అని తలచి చావడిలో కూర్చుని ఉండగా ఇతని మనసులో ఉన్న భావము గ్రహించినట్లుగనే స్వామీజీ అదే పాటను పాడి అతని మనసుకు ధైర్యమునిచ్చిరి . 

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2232
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1348 on: October 28, 2017, 06:57:55 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో ॥ 1.  అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
            సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥   

                                             శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి .శైలజ )

అంతేకాక స్వామీజీ వీరితో 108 గురుచరిత్ర పారాయణములను ,సాయినామ ఏకాహములను చేస్తే పరిస్థితి పూర్తిగా అనుకూలిస్తుందని  చెప్పి ,ఊదీ ,తీర్ధముల నిచ్చి ఆమె ప్రాణరక్షణకై వచ్చిన వీరి  రక్షణ బాధ్యత తాను  వహించిన స్వామీజీ బాబ్రీ మసీదు గొడవలతో అల్లకల్లోల్లముగా నున్న దేశ పరిస్థితులను కూడా దృష్టిలో నుంచుకొని తిరుగు ప్రయాణములో వీరికెటువంటి ఇబ్బందులూ ఎదురుకాకూండా తగు జాగ్రత్తలూ ,సూచనలూ ఇచ్చి వీరిని హైదరాబాదు పంపించిరి .

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2232
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  2.యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥


                            శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

హైదరాబాదు వచ్చిన తరువాత మల్లేష్ ,రాజులు సంగతులన్నీ వివరించి చెప్పగా మిగిలిన సభ్యులు  ఆలోచించి స్వామీజీ సెలవిచ్చిన పనిని ఎవరు పూర్తిచేయగలరని యోచించగా 108 గురుచరిత్ర పారాయణములు చేయుటకు ముందుకు వచ్చిన శైలజ  బాధ్యతను స్వీకరించుటకు సిద్ధపడడమే కాక అతి తక్కువమంది కలిగిన సభ్యులతో సాయినామ ఏకాహములు నెలకొకసారి వహించు బాధ్యతను కూడా చేపట్టింది .  ఆ రకముగా కేవలము పదిమంది కూడా లేని సభ్యులతో రాత్రింబవళ్లు ఏకాహము పూర్తిచేయుట మాటలు కాదు . అయినా ఈ పనిని ఆమె ఎంతో శ్రద్ధగా నిర్వహించింది . నియమ నిష్ఠలతో  కూడుకున్న గురుచరిత్ర పారాయణ బాధ్యత స్వీకరించిన శైలజ కొంత వ్యవధి తీసుకున్నటప్పటికీ కబూతర్ ఖానాలోని తాతగారు ప్రతిష్టాపన చేసిన మందిరములో 1994 సం . లో 49 రోజుల సప్త సప్తాహ కార్యక్రములో ఈ గురుచరిత్ర పారాయణ ప్రారంభించి ప్రతిరోజూ ఒక్కొక్క పారాయణము చొప్పున రోజుకొక పారాయణము ప్రారంభించినది . 49 రోజులనుకున్న భజన కార్యక్రమము 108 రోజులకు పొడిగింపబడడంతో ఈమె పారాయణలకు భంగం కలుగకుండా అఖండముగా 108 పారాయణములు కొనసాగించింది . అయితే ఆఖరి 15 పారాయణములతో 14 పారాయణములను ఏ స్వామీజీ అయితే తనకు ఈ బాధ్యత నిచ్చారో  స్వామీజీ సన్నిధియైన చావడిలో పూర్తిచేసుకుని ఆఖరు పారాయణను తమ మాట మన్నించి ఆమెకు ప్రాణభిక్ష నొసగిన సాక్షాత్ దత్తస్వరూపుడైన తాత సమాధి వద్ద పూర్తిచేయుట ద్వారా  గురుదీక్షను విరమించింది . తాత ప్రసాదించిన ఆ ప్రాణభిక్ష శక్తితో  మందిర శంఖుస్థాపన ,విగ్రహ ప్రతిష్ఠలు ,భజన కార్యక్రమములను  ఎత్తున జయప్రదముగా నిర్వహించ గలుగుతున్నది .


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!