EXTRA_HEADERS; @include_once "{$config['file_root']}/{$lang}/includes/header-portal-pages.inc.php"; ?>

వెబ్ కు ఒక మంచి మార్గము

లేదా, ఒక ఒపెన్ సోర్స్ సంఘటిత-శక్తి విహరిణి మీకొరకు ఏమిచేయ గలదు.

ఏమిటి ఈ స్పష్టమైన పునాదులు గల సాఫ్ట్ వేర్ ?

సాఫ్ట్ వేర్ సంస్థలు వెళుతున్నట్లు కాక, మేము కొంచె భిన్నంగా వెళుతున్నాము. మేము ఇతరుల కన్నా భిన్నంగావున్న మార్గాలను సంకలనం చేయుటకు మేము 'స్పష్టమైన పునాదులు గల సాఫ్ట్ వేర్ ' అను పదమును ఉపయోగిస్తాము:

మా యొక్క సుపరిచిత సాఫ్ట్ వేర్ , ఫైర్‌ఫాక్స్‍, అంతర్జాతీయంగా వేలాదిమంది సమిష్టికృషితో సృష్టించబడింది, కొంతశాతం మాత్రమే మావాస్తవ ఉద్యోగులద్వారా జరిగింది.

వ్యాపార దృష్ట్యా అంటే లాభాలు లేదా స్టాక్‌యొక్క ధర (ఎమిటో ఊహించండి: కనీసం మేము స్టాక్‌కూడా కలిగిలేము) వీటి దృష్ట్యాకాక మేము మాక్రియాధర్మాన్ని వెబ్‌నందు నిష్కాపట్యము, సృజనీయత మరియు అవకాశము పెంచుతూ నిర్వర్తిస్తున్నాము.

మరియు ఒక లాభాపేక్ష-లేని, ప్రజా ఉపయోగక సంస్ధ , సముదాయాలను నిర్మించుట మరియు ప్రజల జీవితాలను సంపన్నం చేయుటద్వారా మేము సాఫల్యతను నిర్వచిస్తాము. మేము ఇంటర్నెట్‌యొక్క శక్తి మరియు సామర్ధ్యంను నమ్ముతాము మరియు అది ప్రతి ఒక్కరికొరకు, ప్రతిచోట వర్ధిల్లేటట్లు చూడాలి అనుకుంటున్నాము.

Firefox girl

ఓపెన్ సోర్స్ అంటే ఎంటి?

మొదట ఇది వింతగా అనిపించవచ్చు, అయితే మాతో ఉండండి: మా “రహస్యాలు” బాగాతెలిసిన వారిని మేము నమ్ముతాము.

అందుకని, మేము ఫైర్‌ఫాక్స్ సోర్స్ కోడ్‌ ని బయల్పరుచుతున్నాము – ఈ పనినంతటిని ఏదిచేస్తుందో చాలా విపులంగా & వివరంగా – ప్రపంచానికి తెలుపుతున్నాము మరియు ప్రతి ఒక్కరిని చూడమని ప్రోత్సహిస్తున్నాము.

కొంతమంది విషయాలను మెరుగుపరచుటకు పరిష్కరించుటకు చూస్తున్నారు. ఇతరులు కొత్త సౌలభ్యాలపట్ల ఆలోచనలను కలిగివున్నారు అవి జరుగునట్లు చేస్తున్నారు. ఇతరులు ఆ కోడ్ తీసుకొని, వారి ఆలోచనలను ఆపాదించి సరికొత్త (అబ్బురపరిచే) ఉత్పత్తులను తయారుచేస్తున్నారు.

దీని సారాశం ఏమిటంటే? సార్వజనీయంగా ఉండుటవలన మంచిపనులు జరుగుతాయి. ఎవరైనా మా పరదాలమాటునుండి తొంగిచూడవచ్చు…నిజానికి, అక్కడ ఎటువంటి పరదాలు లేవు.

మీరు ఎందుకు జాగ్రత్త వహించాలి?

మాది ఒక సాధారణ సంస్థ లాంటిది కాకపోవచ్చు, అయితే ముఖ్య విషయాలపై ఎలా దృష్టి వుంచాలో మాకు తెలుసును: మీ కోసం వెబ్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నాము.

మా సంస్థనందు వున్న కొద్దిమంది ఉద్యోగులపై ఆధారపడుటకన్నా సార్వజనీయంగా వుండుటవలన ప్రపంచం నలుమూలలనుండి సృజనీయమైన ఉత్తమ ఆలోచనలను ఎవరినుండైనా పొందగలము. పరిస్థితిని ఆ విధంగా చూస్తున్నప్పుడు, దానిని వేరేమార్గం ద్వారా ఎందుకు చేయకూడదు?

ఈ మాటలన్నీ స్పష్టమైన పునాదులుగల సాఫ్ట్ వేర్ మరియు ఓపెన్ సోర్స్ చివరిగా మీకు మరియు 130 మిలియన్ల రోజువారి ఫైర్‌ఫాక్సు వినియోగదారులకు ఉత్తమ విహరిణిని ఇస్తున్నాయని చెబుతున్నాయి. దీనర్ధం ఎక్కువ-నాణ్యమైన, అత్యంత సురక్షితమైన ఉత్పత్తి. దానర్ధం సృజనీయత, అందిరికి అందుబాటులోవుండు ఇంటర్‌నెట్ కు స్వేచ్ఛను మరియు మద్దతును ఇస్తుంది.