మొజిల్లా సాంప్రదాయ సాఫ్టువేర్ సంస్థ వంటిది కాదు. మేము ఏప్రాంతప్రజలకైనా ఆన్‌లైన్ అనుభూతిని మెరుగుపరచుటకు ఉచిత, ఓపెన్ సోర్స్ సాఫ్టువేర్ ఉత్పత్తులను మరియు సాంకేతికతలను నిర్మించుటకు తీర్మానించుకున్న అంతర్జాతీయ సముదాయము . మేము వెబ్‌ను తెరిచివున్న భాగస్వామ్య ప్రజా వనరుగా ఉంటునట్లు చూడుటకు ప్రపంచం నలుమూలలనుండి పనిచేస్తున్న ప్రోగ్రామర్లము, వర్తకులము, పరిశీలకులము, మరియు అడ్వకేట్లము. అగోప్యతా ప్రమాణాలు సృజనీయతను మరియు సావకాశాన్ని చేతనపరచి మరియు ప్రతి ఒక్కరు , సురక్షితమైన, వేగవంతమైన మరియు మంచి సాధ్యమగు ఆన్‌లైన్ అనుభూతిని పొందునట్లు చేస్తుంది.
మా యొక్క అవార్డ్ గెలుచుకున్న, ఓపెన్ సోర్స్ సాఫ్టువేర్ ఉత్పత్తులు మరియు సాంకేతికతలు మొత్తం 40 భాషల్లో ఎక్కడి ప్రజలకైనా ఉచితంగా అందివ్వబడుతున్నాయి.
మొజిల్లా ముఖ్య కార్యాలయము మౌంటైన్ వ్యూ, కాలిఫోర్నియా నందు ప్రాంతీయ కార్యాలయములు ఆక్‌లాండ్, బీజింగ్, కొపెన్‌హాగన్, పారిస్, టోక్యో and టొరన్టో నందు కలవు.